హమ్మయ్యా.. మెగాస్టార్ చిరుకు కరోనా నెగిటివ్.. ఫాల్టీ కిల్ వల్ల తప్పుడు రిపోర్ట్..!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్. తనకు కరోనా సోకలేదని చిరంజీవి తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ఫాల్టీ ఆర్టీ పీసీఆర్ కిట్ వల్ల పొరపాటున కరోనా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరువాత, బేసిక్ మెడికేషన్ స్టార్ చేశాను’ అని చిరంజీవి పేర్కొన్నారు. 

‘రెండు రోజులైన ఎక్కడా ఎలాంటి లక్షనాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సిటీ స్కాన్ తీసి చెస్ట్ లో ఎలాంటి ట్రేసెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరొక్కసారి, మరో చోట నివృతి చేసుకుందామని నేను టెనెట్ ల్యాబ్ లో 3 రకాల కిట్స్ లతో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా కూడా నెగిటివ్ వచ్చింది’ అని చిరంజీవి వెల్లడించారు. 

‘ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చిన చోట కూడా ఆర్టీ పిసీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తరువాత మొదటి రిపోర్ట్ ఫాల్టీ కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలకు, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.   

Leave a Comment