అవినీతి చేయాలంటే భయపడాలి : సీఎం జగన్

రాష్ట్రంలో అవినీతి చేయాలంటే భయపడాలని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సోమవారం అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 1902 నెంబర్ ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలన్నారు. టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ కార్యాలయాల్లో అవినీతి ఉండకూడదన్నారు. 14400 నెంబర్ పై మరించ ప్రచారం నిర్వహించాలన్నారు.

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సమయంలో వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలన్నారు. దీని కోసం అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చేలా బిల్లును రూపొందించాలన్నారు. కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతున్నాయంటే అవినీతి నిరోధకత విషయంలో సీరియస్ గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయన్నారు. దిశ చట్టం మాదిరిగానే అవినీతిపై నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.  

Leave a Comment