క్రికెట్ ఆడిన సీఎం జగన్..!

పాలనలో నిత్యం బిజీగా ఉండే సీఎం జగన్ సరదాగా క్రికెట్ ఆడారు. అదిరిపోయే షాట్లు ఆడి అభిమానులను అలరించారు. శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్టేడియంలో క్రికెట్ ఆడారు. రెండు బంతులను ఆడి షాట్లతో అలరించారు. 

 

Leave a Comment