అద్భుతమైన క్యాచ్ అందుకున్న హర్లీన్ డియోల్.. వీడియో వైరల్..!

ఇంగ్లండ్, టీమిండియా మహిళల జట్ల మధ్య శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శశికళ పాండే వేసిన బంతిని ఇంగ్లండ్ క్రికెటర్ అమీ జోన్స్ లాంగ్ ఆఫ్ వైపు కొట్టింది. బౌండరీపై నుంచి బంతి దూసుకెళ్తండగా లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బ్యాలెన్స్ కోసం బంతిని బౌండరీ లోపలికి నెట్టేసి, ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. 

ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ క్యాచ్ అంటూ క్రికెటర్లు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హెర్లీన్ క్యాచ్ కు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసించారు. క్రికెట్ మైదానంలో ఎప్పుడూ చూడని మంచి క్యాచ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే నార్తాంప్టన్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. 

Leave a Comment