అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ భవనం..!

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేశారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోడీ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పలు పూజలు నిర్వహించారు. అనంతరం నవకలశ స్థాపన తర్వాత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

 దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాాణానికి సంకల్పించారు. 2022 ఆగస్టు 15 నాటికి ఈ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.971 కోట్ల ఖర్చుతో సెంట్రల్ విస్టా కొత్త పార్లమెంట్ భవనాన్ని 1,224 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా నిర్మించనున్నారు. 

 

Leave a Comment