వీళ్లసలు మనుషులేనా? : సీఎం జగన్ ఫైర్

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాయలం నుంచి వర్సువల్ విధానం ద్వారా తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మీట్ కు 13 జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారిగా ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నారు.

పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. తప్పు ఎవరి చేసినా అది తప్పే అని, తమ వారు తప్పు చేసినా వదలొద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దానిని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోందన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక కొంత మందికి దేవుడు అంటే భయం, భక్తి లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడిపై రాజకీయం చేస్తున్నారన్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కులాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. వీళ్లు అసలు మనుషులేనా అంటూ మండిపడ్డారు.

‘దేవుడు విగ్రహాలను కూల్చడం వల్ల ఎవరికీ లాభం జరుగుతుంది, ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు ఎవరికి లాభం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరినీ లక్ష్యంగా చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గుర్తించాలి’ అంటూ సీఎం జగన్ కోరారు.  

Leave a Comment