చీరలో వచ్చిన వారికి అనుమతి లేదన్న రెస్టారెంట్ మూత..!

చీర కట్టు మన దేశ సంప్రదాయంలో ప్రాముఖ్యమైంది. విదేశీయులు సైతం గౌరవించే చీరకట్టు సాంప్రదాయాన్ని మన దేశంలోని ఓ రెస్టారెంట్ గౌరవించకపోవడం సిగ్గుచేటు.. ఢిల్లీలోని అక్విల్ రెస్టారెంట్ చీర కట్టుకొని రెస్టారెంట్ కు వచ్చిన మహిళకు అనుమతి ఇవ్వలేదు. చీర స్మార్ట్ అండ్ క్యాజువల్ గా పరిగనించబడదని చెప్పింది.  

ఇప్పుడు ఆ రెస్టారెంట్ కు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాకిచ్చారు. ఆ రెస్టారెంట్ మూసివేయాలని ఆదేశించారు. అక్విల్ రెస్టారెంట్ తగిన అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆ రెస్టారెంట్ నడుస్తోందని పేర్కొన్నారు. 

ఈక్రమంలో తాము రెస్టారెంట్ ను ఈనెల 27 నుంచి మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. వ్యాపార అనుమతులు పొందే వరకు రెస్టారెంట్ ను ప్రారంభించబోమని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా రెస్టారెంట్ లో తనకు అవమానం జరిగిందంటూ ఓ మహిళ ఆరోపించారు.  

 

Leave a Comment