పెన్షన్ డబ్బులతోనే కారు ఈఎంఐ చెల్లించిన ఏకైక ప్రధాని.. ఎవరో మీకు తెలుసా?

లాల్ బహదూర్ శాస్త్రీ.. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుల్లో ప్రముఖుడు.. దేశ రెండో ప్రధాన మంత్రి.. దేశం మరచిన మహానేత.. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రాజకీయాల్లో అసలు మచ్చేలేని వ్యక్తి.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినా ఎటువంటి అవినీతి మరకలు గానీ, ఆరోపణలు కానీ ఎదుర్కోని ఏకైక నేత లాల్ బహదూర్ శాస్త్రీ.. దేశ అత్యున్నత పదవిలో ఉన్నా.. కారు కోసం రుణం తీసుకుని.. చివరికి పెన్షన్ డబ్బుతో కారు ఈఎంఐ చెల్లించారు.. 

దేశానికి ప్రధానిగా ఉన్నా ఆయనకు సొంత కారు లేకపోవడం విశేషం..అప్పట్లో ఆయన సొంత కారు కొనేందుకు బ్యాంకులో రుణం తీసుకున్నారు. రూ.5 వేలు అప్పు తీసుకుని ఫియట్ కారు కొనుగోలు చేశారు. దురదృష్టం ఏంటంటే ఆయన కొన్న కారులో పూర్తిగా తిరగలేకపోయారు. కారు కొనుగోలు తర్వాత రష్యా పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ తాష్కెంట్ లో ఉండగా మరణించారు. 

ఆయన మరణం తర్వాత భార్యకు పెన్షన్ వచ్చేది.. ఆ పెన్షన్ డబ్బులతో లాల్ బహదూర్ శాస్త్రీ భార్య ఫియల్ కారు కోసం తీసుకున్న రూ.5 వేల రుణం ఈఎంఐలను క్లియర్ చేశారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న పెన్షన్ డబ్బులతో కారు ఈఎంఐ చెల్లించిన ఏకైక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ.. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు..  

Leave a Comment