ఇదేనా మీ క్వాలిటీ.. డొమినోస్ పిజ్జా పిండిపై టాయిలెట్ బ్రష్..!

పిజ్జా అంటే గుర్తొచ్చేది డొమినోస్.. ఈ విదేశీ కంపెనీ మన దేశంలోనూ ఎన్నో బ్రాంచిలను కలిగి ఉంది. అసలు డొమినోస్ అంటేనే మంచి టేస్ట్ తో పాటు క్వాలిటీ మెయిటెన్ చేస్తారని నమ్ముతారు.. అయితే మీరు ఈ ఫొటో చూస్తే మాత్రం ఛీఛీ.. ఇదేం క్వాలిటీ అంటూ తిట్టిపోస్తారు.. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.. 

బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల సంస్థకున్న మంచి పేరు, గుర్తింపు పోగుట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోసా రోడ్ లో ఉన్న డొమినోస్ అవుట్ లెట్ లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. అయితే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్ లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. ఈ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై డొమినోస్ స్పందించింది. రెస్టారెంట్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  

Leave a Comment