జాబ్ వదిలి.. టీ స్టాల్ పెట్టి.. లక్షలు సంపాదిస్తున్న మహిళ..!

మన దేశంలో ఎంతో మందికి ఇష్టమైన పానీయం ఏదంటే.. అది చాయ్.. అవును నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎన్నో కప్పుల టీ తాగేస్తుంటారు.. ఇప్పుడు ఈ చాయ్ ని యువకులు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. కొంత మంది ఉద్యోగాలు సైతం వదిలి టీ వ్యాపారం చేస్తున్నారు. రాజ్ కోట్ కి చెందిన నిషా హుస్సేన్ కూడా అలాంటి కోవాలోకి వస్తోంది..

2017లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజ్ కోట్ లోని ఓ చాయ్ వాలీ షాప్ లో పని చేస్తూ మెళకువలు నేర్చుకుంది నిషా. ఇప్పుడు ఆమెనే సొంతంగా ‘ది చైలాండ్’ పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. ఆమె టీ స్టాల్ లో 10 రకాల రుచులతో టీ విక్రయిస్తోంది. టీ వ్యాపారం చేయడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినా ఏర్పాటు చేసి సక్సెస్ సాధించింది.  

టీ స్టాల్ పెట్టిన కొత్తగా కస్టమర్లు ఎవరూ రాలేదు. అలా 15 రోజులు ఆమె తన టీ స్టాల్ లో టీ వృథా అయ్యేది.  కానీ ఓ కస్టమర్ తన వ్యాపారం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో నిషా టీ స్టాల్ ఫేమస్ అయిపోయింది. జనం కూడా ది చైలాండ్ కి రావడం ప్రారంభించారు. ప్రతి నెలా రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ప్రజలు తనను రాజ్ కోట్ యొక్క చాయ్ వాలీ అని పిలవడం తనకు సంతోషంగా ఉందని చెబుతోంది..

Leave a Comment