వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఓ వ్యక్తిలో అయస్కాంత శక్తి..!

కరోనా మహమ్మారితో కారణంగా దేశం అతలాకుతలమైంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి. చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ విషయంలో రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. 

తాజాగా కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న తర్వాత శరీరంలో ఆయస్కాంత శక్తి ఉత్పన్నమైందని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన అరవింద్ జగన్నాథ్ సోనార్ అనే 71 ఏళ్ల వ్యక్తి చెబుతున్నాడు. అతడి శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్ ను, చెంచాలను ఆయస్కాంతంగా ఆకర్షించుకుంటుంది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. 

తొలుత చెమట కారణంగా ఇనుప వస్తువులు శరీరానికి అతుకుతున్నాయని జగన్నాథ్ సహా కుటుంబ సభ్యులు భావించారు. కానీ, స్నానం చేస్తున్న సమయంలోనూ ఇనుప వస్తువులు తన శరీరానికి అంటుకోవడం చూసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. టీకాకు, ఈ ఆయస్కాంత శక్తికి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. 

ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన వెబ్ సైట్ లో వ్యాక్సిన్ ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రదేశంలో ఎలాంటి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయగల పదార్థాలను కలిగి ఉండవని తెలిపారు. టీకాల తయారీలో ఇనుము, నికెల్, కోబాల్ట్, లిథియం, వంటి మిశ్రమాలకు తావులేదని స్పష్టం చేసింది. 

 

View this post on Instagram

 

A post shared by Bol Bhidu (@bolbhidu)

Leave a Comment