సోనూసూద్ కు పద్మ విభూషణ్ ఇవ్వాలి.. ట్రెండింగ్ లో సోనూసూద్..!

ఆయా రంగాల్లో విశిష్ట సేవ చేసినే వారికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రదానం చేస్తుంది. ప్రతి ఏడాది జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. తాజాగా పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయాలని కేంద్రం కోరుతోందనే వార్తను పీటీఐ వెల్లడించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషన్, పద్మశ్రీ నామినేషన్ల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీని చివరి తేదీగా తెలిపింది. 

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ చాలా మంది ఆరాధిస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోనూసూద్ పేరును పద్మ అవార్డుకు నామినేట్ చేశాడు. సోనూసూద్ కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తాను గట్టిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తన ప్రతిపాదనను సమర్థించే వారంతా తన ట్వీట్ ను రీట్వీట్ చేయాలని కోరాడు.  

ఈ ట్వీట్ కు రియల్ హీరో సోనూసూద్ తనదైన శైలిలో స్పందించారు. ‘135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో దటీజ్ సోనూసూద్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.   

Leave a Comment