నిరంతరం మాస్క్ తో వచ్చే ఇబ్బందులు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లాకల్లోలం చేసింది. కరోనా కారణంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.. అయితే నిరంతరం మాస్క్ ధరించడం వల్ల కొన్ని దంత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నయంటున్నారు దంత వైద్య నిపుణులు.. 

ఎక్కువ సేపు మాస్క్ ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుందని, ఇది గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్ సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 

ఆరోగ్య సమస్యలు:

  • కరోనా వైరస్ కారణంగా మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. 
  • రోజంతా మాస్క్ ధరించడం వల్ల, మంచి నీరు తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో నోటిలో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వృద్ధికి కారణమవుతుంది. 
  • కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి చాలా మందికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది. స్టెరాయిడ్స్ వాడటం వల్ల చాలా మందిలో బ్లాక్ ఫంగస్ కు దారితీసింది. అయితే ఇప్పటికే పిప్పి పళ్ల సమస్య ఉన్న వారికి స్టెరాయిడ్స్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. చిగుళ్లు, దవడ వాపు లక్షణాలు బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో ఉన్నాయి. దీంతో ఏదీ బ్లాక్ ఫంగసో? ఏదీ చిగుళ్ల వాపు వ్యాధో గుర్తించడం కష్టమవుతుంది. 

ఏం చేయాలి?

  • కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్ చేసుకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది దీనిని వాయిదా వేస్తున్నారు.
  •  ప్రస్తుత జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్నారు. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం 6 నెలలకోసారి దంతాలను క్లీన్ చేయించుకోవాలి. కోవిడ్ టీకా తీసుకున్న వారు కూడా దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం..  

 

Leave a Comment