గెట్ వెల్ సూన్ బాస్.. ఆస్పత్రిలో క్రిస్ గేల్ ఇలా..

క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.. ఐపీఎల్ 13వ సీజన్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ ను జట్టులోకి తీసుకోవాలని జట్టు భావించింది. అయితే గేల్ ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గేల్ కు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో జట్టులోకి తీసుకోలేదని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. 

కాగా క్రిస్ గేల్ హాస్పిటల్ లో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్న. సమస్యల్లో ఉన్నప్పుడు నేను పోరాటం చేయకుండా వెనుకడుగు వేయను. నేను యూనివర్సల్ బాస్ ని. నేను ఎప్పటికీ మారను. ఎంత కష్టం వచ్చనా ఎదుర్కొంటాను. అంతే కాని నా శైలిని మార్చుకోను. బతకడం అనేది ఒక కళ. అంది అందరికీ రాదు. ప్రస్తుతం నేనే బాగానే ఉన్నా. మీ ఆశీర్వాదం బలం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు.’ అంటూ పేర్కొన్నాడు. 

గేల్ పోస్ట్ చేసిన ఫొటోలో బెడ్ పై పడుకుని క్యారెట్ తింటూ, కీర ముక్కలను కళ్లపై పెట్టుకుని, చేతిలో గ్లాస్ పట్టుకుని..మరో చేతిలో ఫోన్ మాట్లాడుతున్నాడు. దీంతో గెట్ వెల్ సూన్ బాస్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  

Leave a Comment