సుశాంత్ ఆత్మతో చిట్ చాట్.. వీడియో వైరల్..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణం మొత్తం ఇండియానే కుదిపేసింది. అతను మరణించి నెల రోజులు అవుతున్నా ఫ్యాన్స్ మాత్రం ఆయన ధ్యాసలోనే ఉన్నారు. అయితే సుశాంత్ మరణంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, లేదు హత్య చేశారని మరికొందరు వాదిస్తున్నారు. పోలీసులు మాత్రం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగానే నిర్ధారించారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్ సుశాంత్ ఆత్మతో మాట్లాడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో  పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో స్టీవ్ సుశాంత్ ఆత్మతో పలు ప్రశ్నలు సంధించినట్లు కనిపిస్తుంది. దీనికి ఫాలో అప్ కూడా ఉంటుందని స్టీవ్ చెప్పాడు. సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని హుఫ్ కు కొద్ది రోజులుగా ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ఈమెయిల్స్, మెసేజెస్ వచ్చాయట. దీంతో ఆయన జూలై 13న ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించినట్లు వెల్లడించారు.  

Leave a Comment