470 అమ్మాయిలకు ఆయనే తండ్రి..!

ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అనాథలుగా ఉంటారు. పిల్లలు లేని తల్లదండ్రులు చాలా మంది అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటారు. వారి మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. అయితే దత్తత తీసుకోవాలనుకుంటే ఒకరినో లేదా ఇద్దరినో తీసుకుంటారు. అందులోనూ చాలా మంది మగపిల్లాడిని దత్తత తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా 470 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్నాడు.  అంతే కాదు వారికి వివాహాలు కూడా చేశాడు. 

ఆయనే ది మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ మహేష్ సవాని. ఆయన గుజరాత్ లోని భావ్ నగర్ కు చెందిన వజ్రాల వ్యాపారి. రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఆయన మానవతా వాది. పేదలకు తన వంతు సాయం చేయాలన్నా ఉద్దేశ్యంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే..

మహేష్ కి ఒక అన్నయ్య ఉండేవారు. ఆయన చనిపోయాడు. ఆ సమయంలో ఆయన పిల్లలు యుక్త వయస్సులో ఉన్నారు. తన అన్నయ్య పిల్లల బాధ్యతను మహేష్ తన భుజాన వేసుకున్నారు. తన అన్నయ్య కూతురి పెళ్లి చేశారు. ఆ సమయంలో మషేష్ కి అర్థమైంది ఏందంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం ఇంత కష్టమా అని. 

అప్పటి నుంచి మహేష్ ఆలోచనలో పడ్డారు. తన గ్రామంలో తండ్రి లేని ఆడపిల్లలందరినీ దత్తత తీసుకోవాలని అనుకున్నాడు. కుల మత భేదం లేకుండా గ్రామంలోని ఆడపిల్లలను దత్తత తీసుకున్నాడు. వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశాడు. వారి పెళ్లిళ్లు జరిపించాడు. అలా 2014లోనే 111 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించాడు. వారి పెళ్లికి కావాల్సిన అన్ని సమకూర్చాడు. అలా ఇప్పటి వరకు 470 మంది ఆడపిల్లల పెళ్లల్లు జరిపించాడు. 

Leave a Comment