సీఎం జగన్ పై మెగాస్టార్ చిరు ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?

32
Magastar Chiranjeevi

ఏపీ సీఎం జగన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ ను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులోనే ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో వైద్య సిబ్బంది ఈ ఘనత సాధించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. 

‘ఆంధ్రప్రదేేశ్ వైద్య సిబ్బంది ఒకేరోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేడయం ఓ గొప్ప కార్యం. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కోవిడ్ ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. జగన్ ది స్ఫూర్తిదాయక నాయకత్వం.. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

కాగా కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆదివారం 13 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ అందించింది. వాస్తవానికి ఒక్క రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దాన్ని అధిగమిస్తూ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. 

 

Previous articleఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?
Next articleఅత్యధిక సంతానం ఉంటే రూ.లక్ష బహుమతి.. మిజోరం మంత్రి బంపర్ ఆఫర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here