తినే వస్తువు అనుకొని.. మెంతో ప్లస్ డబ్బాను మింగిన చిన్నారి..!

చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆడుకుంటూ ఏదైనా కలర్ ఫుల్ గా కనిపిస్తే వెంటనే నోటిలో పెట్టుకుంటారు. ఒక్కోసారి పిల్లలు వాటిని మింగెస్తారు కూడా.. ఇలా చేయడం వల్ల పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 

తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. ఓ 9 నెలల చిన్నారి ఆడుకుంటు మెంతో ప్లస్ చిన్న డబ్బాను మింగేసింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎంతో జాగ్రత్తగా చిన్నారి నోట్లో నుంచి డబ్బాను తొలగించి అతడి ప్రాణాలు కాపాడారు.

స్థానిక వలిసాబ్ రోడ్ సహామీరియా వీధిలో ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి చేతికి మెంతో ప్లస్ చిన్న డబ్బా దొరికింది. దానిని తినే వస్తువు అనుకున్న ఆ చిన్నారి.. దాన్ని తీసి నోట్లో వేసుకుంది. అంతే అది గొంతులో ఇరుక్కుపోయింది. చెబుతామంటే ఆ పాపకు మాటలు రావు.. ఇంట్లో వారు పనిలో మునిగిపోయారు. దీంతో ఆ పాప ఒకటే ఏడుపు మొదలుపెట్టింది.

కొద్ది సేపటి తర్వాత ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు గంటసేపు శ్రమించి చిన్నారి గొంతులో నుంచి మెంతో ప్లస్ డబ్బాను బయటకు తీశారు వైద్యులు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Leave a Comment