గ్యాస్, అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దూరం చేయండి..!

మన ఆహారపు అలవాట్లు..ఇతర కారణాలు.. గ్యాస్, అసిడిటీ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ సమస్య వస్తే చాలు అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ఒక్కోసారి పుల్లని తేన్పులు వస్తుంటాయి. అందుకే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

గ్యాస్, అసిడిటీ సమస్యలకు చిట్కాలు:

  • ఏలకులు తినడం వల్ల జీర్ణ రసాలు త్వరగా ఏర్పడతాయి. దీని వల్ల కడుపులో తక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీంతో పాటు కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఉదర గ్యాస్, తేన్పుల నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు మూడు సార్లు ఏలకుల గింజలను నమలండి..
  • ఆహారం తిన్న తర్వాత అర టీస్పూన్ వేయించిన సోపును నమలడం ద్వారా తరచుగా వచ్చే తేన్పులు, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సోపు జీర్ణ వ్యవస్థను సడలించడంతో పాటు కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్య, గొంతులో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
  • కడుపులో గ్యాస్ ఉన్నట్లయితే ఒక దూదిపై ఇంగువ పొడిని ఉంచి నాభిపై ఉంచండి. ఇలా చేయడం వల్ల కడుపులోని గ్యాస్ తొలగిపోయి కడుపు నొప్పి సమస్య కూడా నయమవుతుంది.
  • కడుపులో గ్యాస్, అసిడిటీ, పుల్లని తేన్పులు ఉన్నట్లయితే నారింజ రసంలో కొద్దిగా వేయించిన జీలకర్ర, రాళ్ల ఉప్పు కలిపి తాగాలి. ఇది మీకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 
  • ఆహారంలో రోజూ పెరుగు లేదా మజ్జిగను చేర్చండి. ఇది కడుపులో గ్యాస్, తేన్పుల నుంచి ఉపశమనం అందిస్తాయి.
  • కడుపులో గ్యాస్ ఉన్నట్లయితే ఒక స్పూన్ వామును, నాలుగో వంతు నిమ్మరసంలో కలిపి తీసుకోండి. దీని వల్ల గ్యాస్ వెంటనే తగ్గుతుంది. 
  • మీరు అసిడిటీతో ఇబ్బంది పడుతుంటే.. ఉదయాన్నే రెండు అరటి పండ్లు తిని, ఒక కప్పు పాలు తాగండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • అసిడిటీ సమస్యకు లవంగాలు కూడా మంచి పరిష్కారం చూపుతాయి. రెండు లవంగాలను నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతుంటే త్వరగా సమస్య తగ్గుతుంది. 
  • భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి తాగాలి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. 
  • ఒక బౌల్ లో కొద్దిగా నీటిని తీసుకొని జీలకర్ర నాలుగు టీస్పూన్లు వేసి బాగా మరిగించాలి. తర్వాత నీటిని వడకట్టి వేడిగా ఉన్నప్పడే తాగేయాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.  

 

Leave a Comment