విశాఖలో విషవాయు విషాదం

పలువురు మృతి

వేలాది మంది అస్వస్థత..

విశాఖ లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోనిఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 8 మంది మరణించగా రెండువేల మందికిపైగా అవస్వస్థతకు గురయ్యారు. 

గురువారం తెల్లవారు జామున పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ విషవాయువు పీల్చడం వల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రజలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఈ కంపెనీకి సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామం వద్ద పెద్ద ఎత్తున ప్రభావం ఉంది. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీ తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో వందలాది మూగజీవాలు చనిపోయాయి. 

అయితె ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీకైంది. దీంతో పరిసరాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వారు ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కొద్ది సేపటికే గ్యాస్ మరోసారి లీక్ కావడంతో ఆందోళన కలిగిస్తోంది. 

 

Leave a Comment