వీడియో వైరల్: గ్రౌండ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన ఫుట్ బాలర్..!

అమెరికన్ ఫుట్ బాలర్ హసానీ డాట్సన్ స్టీఫెన్ సన్ తన గర్ల్ ఫ్రెండ్ కు గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిన్నెసోటా ఎఫ్సీ, సాన్ జోస్ ఎర్త్ క్వేక్స్ మధ్య మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.

మ్యాచ్ డ్రా ముగియగానే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిన హసానీ తన మోకాళ్లపై కూర్చొని విల్ యు మ్యారీ మీ అంటూ ప్రపోజ్ చేశాడు. ఈ సడెన్ సర్ ప్రైజ్ తో అతని గర్ల్ ఫ్రెండ్ షాక్ అయింది. అతని ప్రపోజల్ కు వెంటనే ఓకే చెప్పేసింది. తర్వాత ఇద్దరూ కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు. దీంతో స్టేడియం అంతా హోరెత్తింది. 

 

Leave a Comment