అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు : చంద్రబాబు

ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. 

ఒంగోలులో శుక్రవారం ప్రారంభమైన  మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేశారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడల్లా తాను నిద్రలేని రాత్రులను గడిపానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రతి దాంట్లో బాదుతున్నారని అన్నారు. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులని అన్నారు. జగన్ పాలనలో సంక్షేమం అనేది ఒక బూటకమని చెప్పారు. అమ్మ ఒడి అన్నారు..నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. అమ్మఒడితో కంటే నాన్న బుడ్డీతో ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నారు.  

జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోంద చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతార్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతామన్నారు. 

Leave a Comment