గుడ్ న్యూస్ : పెట్రో పన్నులు తగ్గించే యోచనలో కేంద్రం?

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈనేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. 

వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కొనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామని, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆదాయంపై పెద్దగా ప్రభావం పడకుండా చూసుకుంటూ, వినియోగదారులపై పన్ను భారం తగ్గించేందుకు చమురు మంత్రిత్వ శాఖ మార్గాలు అన్వేషిస్తోంది.   

 

Leave a Comment