‘అగ్నిపథ్’పై కేంద్రం కీలక నిర్ణయం..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ని వీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. 

ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ మొదటి బ్యాచ్ వారికి కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 2 సంవత్సరాలు పొడిగించింది..  

    

Leave a Comment