స్విస్ బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల సంపద..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలు.. ‘బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనాన్ని తీసుకొస్తాం.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తాం.. ఆరు నూరైనా నల్ల ధనం రప్పించి తీరుతాం’.. ఇప్పుడీ మాటలు నీటి మీద రాతలయ్యాయి. ప్రధాని మోడీ ఎన్నలక సందర్భంగా చెప్పిన మాటలను నిలబెట్టుకోలేకపోయారు. 

ఎందుకంటే.. ఈ హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా.. ఒక్క పైసా రప్పించలేకపోయారు. పైగా స్విస్ బ్యాంకులో భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగిపోయింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021లో భారతీయుల సంపద 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్(రూ.30,500 కోట్లు)కు చేరింది. ఇది 14 ఏళ్ల గరిష్టం అని పేర్కొంది. 

స్విస్ బ్యాంకులో 2020 లో భారతీయుల నిధుల మొత్తం రూ.20,700 కోట్లుగా నమోదైంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 50 శాతం పెరిగి 30,500 కోట్లకు చేరింది. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కి సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా.. 379 బిలియన్ స్వీస్ ఫ్రాంక్ లతో యూకే మొదటి స్థానంలో, 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్ లతో అమెరికా రెండో స్థానంలో ఉన్నాయి. 

Leave a Comment