తల్లి సేవలో ప్రధాని మోడీ.. 100వ పుట్టిన రోజు సందర్భంగా..!

ప్రధాని మోడీకి తల్లి హీరా బెన్ పై ఎంత ప్రమో ఉందో అందరికీ తెలిసిందే.. ఈరోజు హీరాబెన్ 100వ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్ లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లారు. 100వ పుట్టిన రోజులు జరుపుకుంటున్న తల్లికి సేవలు చేశారు. ఆమె పాదాలు కడిగి, మిఠాయి తినిపించారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.  

గుజరాత్​లోని తన తల్లి హీరాబెన్​ మోదీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా.. హీరాబెన్​ పాదాలు కడిగి, మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ వేదికగా ‘అమ్మ..ఇది కేవలం పదం కాదు. కానీ ఇది అనేక రకాల భావోద్వేగాలను సంగ్రహిస్తుంది. ఈ రోజు, జూన్ 18 నా తల్లి హీరాబా తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున, నేను ఆనందం మరియు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఆలోచనలను వ్రాసాను’ అంటూ రాసుకొచ్చారు. 

 రెండు రోజుల గుజరాత్​ పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ. శనివారం పావగఢ్​కు వెళ్లనున్నారు. అక్కడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం జెండా ఎగురవేస్తారు. వడోదరలో రూ. 21వేల కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 

Leave a Comment