కరెన్సీ నోట్ల చివరన నల్లటి గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?

దేశంలో కరెన్నీ నిర్వహణను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అన్ని రకాల కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. అయితే ఈ కరెన్సీ నోట్ల ముద్రణ సమయంలో ప్రతి నోటుకు అనేక రకాల భద్రతా లక్షణాలు ఉండేలా చూసుకుంటుంది. ఈ లక్షణాల ఆధారంగా ఆ నోట్ నకిలీదా లేదా నిజమైందా గుర్తించవచ్చు. కరెన్సీ నోట్ల తయారీకి ప్రత్యేకమైన పేపర్ ను ఆర్బీఐ ఉపయోగిస్తుంది. 

నల్లటి గీతలు ఎందుకు?

అయితే కరెన్సీ నోట్ ను గమనిస్తే.. నోటు చివర నల్లటి గీతలు ఉంటాయి. రూ.100 నుంచి రూ.2 వేల కరెన్సీ నోట్లపై ఈ గీతలు కనిపిస్తాయి. ఈ గీతలను ఆర్బీఐ ప్రత్యేకంగా రూపొందిస్తుంది. ఈ గీలు ముఖ్యంగా అంధులను దృష్టిలో ఉంచకుని ముద్రిస్తారు. ఈ ప్రింటింగ్ ను ఎంబోస్ట్ ప్రింటింగ్ అంటారు. ఈ నల్లటి గీతలను తాకినప్పుడు ఆ గీతల స్పర్శ కలుగుతుంది. ఆ స్పర్శ ఆధారంగా ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు..

ఏ నోటుకు ఎన్ని గీతలు ఉంటాయి..

  • కొత్తగా వచ్చిన రూ.100 నోటు మీద నాలుగు గీతలు(|| ||) ఉంటాయి.
  • రూ.200 నోటు మీద నాలుగు గీతలు, గీతల మధ్యలో రెండు చుక్కలు(||..||) ఉంటాయి. 
  • రూ.500 నోటు మీద 5 గీతలు(|| | ||) ఉంటాయి.
  • రూ.2000 నోటు మీద 7 గీతలు(| || | || |) ఉంటాయి. 

Leave a Comment