క్రీడా శాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ..!

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ శివ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు మమతా బెనర్జీ మంత్రి వర్గంలో చోటు లభించింది. 

రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రిగా మనోజ్ తివారీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రమాణ స్వీకారం తనకు కొత్త అనుభూతి ఇచ్చిందన్నారు. తనపై నమ్మకంతో ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన మమత, తన సోదరుడు అభిషేక్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మనోజ్ తివారీ భారత్ తరపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాడు.. 2012లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో తివారీ సభ్యుడిగా ఉన్నాడు.  

Leave a Comment