అసలైన వ్యాక్సిన్ గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాలు..!

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ – వి టీకాలు ప్రజలకు అందజేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లను కూడా నకిలీ వస్తున్నాయి. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకావు వినయోగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. నకిలీ టీకాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇలాంటి నకిలీ వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో దేశంలో ప్రజలకు ఇస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి టీకాలు అసలైనవా? లేదా నకిలీ వ్యాక్సినా అనేది గుర్తించడానికి కేంద్ర మార్గదర్శకాలు జారీ చేసింది.  అసలైన టీకాలను ఎలా గుర్తించాలో వెల్లడించింది. 

కోవిషీల్డ్ వ్యాక్సిన్:

  • కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వయల్ పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. 
  • ట్రేడ్ మార్క్ తో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. జనరిక్ పేరు బోల్డ్ అక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. 
  • సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. 
  • వయల్ పై లేబుల్ అతికి ఉన్న చోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ఎస్ఐఐ లోగో నిట్ట నిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. లేబుల్ పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. మొత్తం లేబుల్ పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. 

కోవాగ్జిన్ వ్యాక్సిన్:

  • కోవాగ్జిన్ వ్యాక్సిన్ లేబుల్ పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. 
  • లేబుల్ పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. 
  • కోవాగ్జిన్ లేబుల్ పై లేత నీలి రంగులో ‘కోవాగ్జిన్’ అనే పేరు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. పేరులో ‘X’ అక్షరం ఆకుపచ్చ రంగులో మిళితమై ఉంటుంది. 

స్పుత్నిక్-వి :

  • స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వయల్స్ రెండు రకాల లేబుల్స్ తో ఉంటాయి. 
  • వ్యాక్సిన్ సమాచారం, డిజైన్ అంతా ఒకేలా ఉన్నప్పటికీ, తయారీదారు పేర్లు వేర్వేరుగా రాసి ఉంటాయి. అక్షరాలన్నీ రష్యన్ భాషలో ఉంటాయి. 
  • ఐదు వయల్స్ కలిగిన ఒక్కో కార్టన్ ప్యాక్ పై ఇంగ్లీష్ అక్షరాలతో లేబుల్స్ రాసి ఉంటాయి. 

 

Leave a Comment