70 ఏళ్ల వయస్సులో తల్లి అయింది.. ఈ దంపతుల ఆనందానికి అంతేలేదు..!

ఈరోజుల్లో పిల్లలు పుట్టడం లేదని చాలా మంది బాధపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన తమకు పిల్లలు పుట్టకపోవడంతో అల్లాడుతున్నారు. ఎంతో మంది పిల్లల కోసం వైద్యుల దగ్గర చూపించుకుంటున్నారు. వారికి ఏ బాబో లేదా పాపో పుడితే వారి సంతోషానికి అవధులు ఉండవు.. అదే లేటు వయస్సులో పిల్లలు పుడితే వారి ఆనందానికి అంతే ఉండదు. తాజాగా గుజరాత్ లోని ఓ వృద్ధ జంటకు తల్లిదండ్రులయ్యారు. ఏకంగా 70 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

రాష్ట్రంలోని మోరా ప్రాంతలో ఉండే 75 ఏళ్ల జివున్ బెన్ రబరి, 70 ఏళ్ల బల్దారి దంపతులు. వారికి పెళ్లయి 45 సంవత్సరాలు అయింది. కానీ ఇంత వరకు వారికి పిల్లలు కలగలేదు. పిల్లల కోసం ఎన్నో వ్రతాలు, పూజలు చేశారు. కానీ పిల్లలు పుట్టలేదు. దీంతో లాభం లేదని వదిలేశారు.. 

కానీ ఆ దేవుడు ఎవరికి ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఈ దంపతులు ఇద్దరు మోరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వృద్ధ మహిళకు గర్భం వచ్చేలా చేశారు. ఐవీఎఫ్ విజయవంతం కావడంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారి ఆనందానికి అంతే లేదు…

Leave a Comment