ఫస్ట్ నైట్ అంటే భయపడి.. కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య..!

ఫస్ట్ నైట్ అంటే భయపడి ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల మేరకు.. మాచర్లకు చెందిన పత్తిగుడుపు కిరణ్ కుమార్(32)కి తెనాలి వించిపేటకు చెందిన యువతితో ఈనెల 11న వివాహమైంది. వీరికి ఈనెల 16న ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. భార్యను తీసుకొని తెనాలి బయలుదేరిన కిరణ్.. గుంటూరులో దిగి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. 

ఎంత సేపు అయినా కిరణ్ రాలేదు. దీంతో కిరణ్ బంధవులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాడేపల్లి కృష్ణా నది వద్ద కుళ్లిన స్థితిలో మృతదేహం లభించింది. మృతుడి జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి పరిశీలించి బంధవులకు సమాధానం ఇచ్చారు. 

కిరణ్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి మృతదేహాన్ని గుర్తించింది. తన కొడుకు ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని, ఫ్రెండ్స్ ధైర్యం చెప్పినప్పటికీ.. తమ కుమారుడు ఇలా చేస్తాడనుకోలేదని కిరణ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment