ఇండియన్స్ టాయిలెట్స్ కడుక్కునే విధానంపై కామెంట్ చేసిన విదేశీయుడికి అదిరిపోయే కంటౌర్ ఇచ్చిన అమ్మాయి..!

టాయిలెట్ కు వెళ్లిన తర్వాత నీళ్లతో కడుక్కోవడం మన ఇండియన్స్ కి ఉన్న అలవాటు.. అయితే విదేశాల్లో మాత్రం టిష్యూ పేపర్ వాడుతారు. అయితే అమెరికా వంటి దేశాల్లో ఇండియన్స్ ను చులకనగా చూస్తుంటారు. అలా టాయిలెట్ వెళ్లిన తర్వాత నీళ్లతో కడుక్కోవడంపై కామెంట్ చేసిన ఓ విదేశీయుడికి ఇండియా అమ్మాయి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఎలాగో తెలుసా?

ముగ్ధ అనే ఇండియా అమ్మాయి ఎమ్ఎస్ చేసేందుకు కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్లింది. అక్కడి వారు భారతీయులను చులకనగా చేస్తూ ఉంటారని ఆమెకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్లేదు. తన స్నేహితుల్లో అలాంటి వారు ఉన్నారు. ముగ్ధ స్నేహితుల్లో జోసెఫ్ ఒకడు.. సమయం దొరికినప్పుడల్లా ముగ్ధను అవమానించడానికి ప్రయత్నిస్తుంటాడు. 

అలా అవమానించడానికి జోసెఫ్ కు ఓ అవకాశం వచ్చింది. ఓసారి పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. డిన్నర్ చేస్తూ భారతీయుల గురించి మాట్లాడటం మొదటుపెట్టాడు. ఇండియన్స్ కు పరిశుభ్రత ఉండదని, టాయిటెట్ కు వెళ్లినా టిష్యూ పేపర్ వాడటం చేతకాదని, నీళ్లతో, చేత్తో కడుక్కుంటారని వాగాడు.. ఇక ముగ్ధ మాత్రం జోసెఫ్ కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది. 

డిన్నర్ సమయంలో రెండో సారి ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది.. వెయిటర్ ప్లేట్లు తీస్తున్నాడు. జోసెఫ్ తిన్న ప్లేట్ తీస్తుండగా.. వద్దని ముగ్ధ వాదించింది. ఓ టిష్యూ పేపర్ ఇచ్చి దానితో తుడిచి క్లీన్ చేసి అదే ప్లేట్ లో ఫుడ్ పెట్టమని చెప్పింది. దీంతో షాక్ అయిన జోసెఫ్.. ప్లేట్ కడగకుండా ఎలా తినాలని అడిగాడు..

అంతే ముగ్ధ అతనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. కేవలం నువ్వు తిన్న ప్లేట్ లో తినడానికే దానిని నీళ్లతో కడగాలని అంటున్నావు.. టిష్యూ పేపర్ తో తుడిస్తే ఆ ప్లేట్ శుభ్రం కాదని నీకు తెలుసు.. అలాంటి శరీరం నుంచి వచ్చే వ్యర్థాలను, మన శరీరాన్ని శుభ్రపరచడానికి మాత్రం టిష్యూ పేపర్ సరిపోతుందని ఎలా అంటావని నిలదీసింది. అంతే జోసెఫ్ తెల్లమొఖం పెట్టేశాడు. తమ పెద్దలు ఆలోచించే ఆరోగ్యకరమైన విధానాలను రూపొందించారని,  ఇంకోసారి ఇండియన్స్ ని హేళన చేస్తే మర్యాదగా ఉండదని కౌంటర్ ఇచ్చింది. 

Leave a Comment