మే 3 వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రద్దు

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది.  కరోనా కట్టడికి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి అన్ని ప్రజా రవాణా సర్వీసులను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు ప్రకటించారు. 

కోవిడ్ మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పునరుద్ఘాటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ మే 3 వరకు అన్ని ప్రజా రవాణా సర్వీసులను నిలుపుదల చేసిందన్నారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి పూర్తి ఛార్జీని తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. 

తదుపరి ప్రకటన వెలువడే వరకు ఏ విధమైన అడ్వాన్సు రిజర్వేషన్లు ఉండవన్నారు. ప్రభుత్వం సూచించిన లాజిస్టిక్స్, గూడ్స్ రవాణా యథావిధిగా జరుగుతుందన్నారు. బస్సులు ఎప్పటి నుంచి తిరిగేది తరువాత తెలియజేస్తామని ఆయన తెలిపారు.  

Leave a Comment