IPL 2020 ఫ్రీ గ చూడండి !

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) బుధవారం ప్రకటించింది. 

దేశంలో Corona virus కేసులు తగ్గకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అంతకు ముందు గత నెలలో ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ మంగళవారంతో ముగిసింది. 

ఏప్రిల్ 20 వరకు అన్ని జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాల వారు నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నాయో నిశితంగా పరిశీలిస్తారు. హాట్ స్పాట్లను పెంచే అవసరం లేని ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతిస్తున్నట్లు మోడీ ప్రసంగంలో తెలిపారు. 

ipl 2020

IPL మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నామని, ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని బీసీసీఐ పేర్కొంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి టోర్నీ నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. 

 

 

DOWNLOAD APP 

Leave a Comment