ఢిల్లీ టు లండన్..బస్సులో.. టికెట్ ధర ఎంతో తెలుసా?

మీకు ప్రపంచమంతా తిరగాలంటే ఇష్టమా? అయితే ఇది మీ కోసమే..మీరు ఢిల్లి నుంచి లండన్ కు వెళ్లాలంటే ఎలా వెళ్తారు? విమానం ఎక్కి వెళ్తారు..అంతేగా..మీరు ఎప్పుడైన లండన్ కు బస్సు మీద వెళ్లాలంటే అది ఎలా సాధ్యం అని అనుకుంటారు. ఇలా వెళ్లాలనుకునే  వారి కోసం ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్’ అనే కంపెనీ ఓ అవకాశం కల్పించింది. గురుగ్రామ్ కు చెందిన ఈ ట్రావెల్ కంపెనీ ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు నడపనున్నట్లు ప్రకటించింది. 

ఈ బస్సులో రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు 70 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ బస్సు 18 దేశాల మీదుగా 20 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్జెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళ్తుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెేల్పర్ ఉంటారు. 

 ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునే వారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చూసుకుంటుంది. అయితే కరోనా కారణంగా ఇంకా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టలేదని కంపెనీ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ తెలిపారు. కరోనా తగ్గాక దీనిని చేపడతామని పేర్కొన్నారు. ప్రయాణికులు మార్గమధ్యలో స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తారట.. ఇక ఎక్కడికి వెళ్లిన భారతీయ వంటకాలనే పెడతారట..ఇక ఈ ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే..2021 మేలో ప్రారంభం కానుంది. ఇక ఈ ట్రిప్ వేయాలనుకుంటే రూ.15 లక్షలు టికెట్ రుసుముగా చెల్లించాలి..

 

Leave a Comment