బుమ్రా పెళ్లి వీడియో, ఫొటోలు వైరల్..!

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ ను సోమవారం గోవాలో పెళ్లి చేసుకున్నాడు. రహస్యంగా అతి కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య బుమ్రా వివాహం జరిగింది. అయితే అతిథులకు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని బుమ్రా దంపతులు చెప్పినట్లు తెలిసింది. అందుకే బుమ్రా వివాహనికి సంబంధించిన పొటోలు ఎక్కువగా బయటకు రాలేదు. 

ఇక సంజనతో పెళ్లి జరిగిన తర్వాత బుమ్రా వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెళ్లి వేడుకకు ముందు నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కూడా బుమ్రా – సంజనతో కలిసి స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment