బడ్జెట్ 2021 : ఏం పెరగనున్నాయి? ఏం తగ్గనున్నాయి?

కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునే చేసేలా నిర్మలా ఎలాంటి ప్రకటనలు చేస్తారని ఆశించారు. అయితే ఈ బడ్జెట్ లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. అంతేకాక కొత్తగా కొన్నింటిపై అగ్రిసెస్ ను విధించింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంపై కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 

అగ్రి సెస్ ఏ వస్తువుల మీద అంటే?

 • గోల్డ్, సిల్వర్ – 2.5 శాతం
 • ఆల్కహాల్ – 100 శాతం
 • క్రూడ్ పామ్ ఆయిల్ – 17.5 శాతం
 • సోయా, సన్ ఫ్లవర్ వంట నూనెలు – 20 శాతం
 • యాపిల్స్ – 35
 • బొగ్గు, ఇగ్నైట్ – 1.5 శాతం
 • ఫెర్టిలైజర్స్ – 5 శాతం
 • బఠానీ – 40 శాతం
 • పల్లీలు, శనగలు – 30 శాతం
 • బెంగాల్ గ్రామ్ – 50 శాతం
 • కాయ ధాన్యాలు – 20 శాతం
 • కాటన్ – 10 శాతం

ఈ బడ్జెట్ లో కొన్ని వస్తువులపై ధరలు పెరగనున్నాయి. మరి కొన్నంటిపై తగ్గనున్నాయి. కాటన్ పై 10 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు పెరగనున్నాయి. లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు, కార్ల విడిభాగాలు పెరుగుతాయి. అయితే బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతాయి. ఈ కొత్త కస్టమ్స్ పాలసీ అక్టోబర్ 21 నుంచి అమల్లోకి రానుంది. 

ధరలు పెరిగేవి ఇవే..

 • ఎలక్ట్రానిక్ వస్తువులు
 • మొబైల్ ఫోన్లు
 • చెప్పులు, పర్సులు
 • చార్జర్స్
 • సింథటిక్ జెమ్ స్టోన్స్
 • లెదర్ ఉత్పత్తులు
 • సోలార్ ఇన్వర్టర్లు
 • ఆటో విడిభాగాలు
 • స్టీలు స్క్రూలు
 • కాటన్
 • రా సిల్స్, యాన్ సిల్స్
 • ఆల్కహాలిక్ బీవెరేజెస్
 • క్రూడ్ పామాయిల్
 • క్రూడ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్
 • ఆపిల్స్
 • బొగ్గు, లిగ్నైట్, పిట్
 • యూరియా 
 • బఠాణీలు
 • కాబూలీ శనగలు
 • బెంగాల్ గ్రాం
 • పప్పులు

ధరలు తగ్గేవి ఇవే..

 • ఐరన్
 • స్టీలు
 • నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్
 • కాపర్ వస్తువులు
 • ఇన్సూరెన్స్
 • షూస్
 • బంగారం, వెండి ధరలు
 • నాప్తా(హైడ్రో కార్బన్ లిక్విడ్ మిక్చర్)

 

Leave a Comment