బడ్జెట్ 2021 : మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వలేదు. ఇంధనం రేట్లు తగ్గుతాయని ఆశపడిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. లీటర్ పెట్రోల్ పై 2.50 రూపాయలు, డిజిల్ పై 4 రూపాయల అగ్రిసెస్ విధిస్తూ ప్రతిపాదనలు చేసింది. 

అగ్రిసెస్ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం మిగితా నిత్యవసరాలపై పడే అవకాశం ఉంది. అగ్రిసెస్ పెంపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 

సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని చెప్పారు. అగ్రి సెస్ విధించి ఇతర ట్యాక్స్ లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్ ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని, దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ స్పష్టం చేశారు.  

Leave a Comment