కౌంటీ క్రికెట్ లో దారుణం : 2 పరుగులకే టీం ఆలౌట్.. 10 మంది డకౌట్స్..!

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో దారుణ గణాంకాలు నమోదయ్యాయి. హకంటింగ్ డాన్ షైర్ కౌంటీ లీగ్ లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో బక్డెన్ క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం రెండు పరుగులకు ఆలౌట్ అయింది. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా సింగిల్ రన్ కూడా తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్లుగా వెనుదిరిగారు. వచ్చిన రెండు పరుగులు కూడా ఒక వైడ్, ఒక బై రూపంలో వచ్చినవే..

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్ జట్టు 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. జట్టులో ఫహీమ్ సబీర్ భట్టి 65, మురాద్ అలీ 67 పరుగులతో రాణించారు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బక్డెన్ జట్టు అమన్ దీప్ సింగ్(6/0), హైదర్ అలీ(2/0) ధాటికి 8.3 ఓవర్లలో 2 పరుగులు చేసి ఆలౌంట్ అయింది. దీంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ జూన్ 19న జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన స్కోర్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

Leave a Comment