చనిపోయిన కుక్కకు విగ్రహం.. ఐదేళ్లుగా వర్థంతి..!

కుక్కంటే విశ్వాసానికి మారుపేరు.. అందుకే చాలా మంది కుక్కను జంతువులాగా చూడరు.. ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు.. దానికి ఏమైన కష్టం వస్తే అల్లాడిపోతారు. ఇక అది చనిపోతే మాత్రం చాలా బాధపడతారు. ఇంట్లో ఓ మనిషి ఇక లేడన్నట్లుగానే ఫీల్ అవుతుంటారు. అలాగే ఇక్కడ కుక్కపై ఉన్న ప్రేమను ఓ యజమాని వినూత్నంగా తెలిపాడు. ఏకంగా కక్కకు విగ్రహం పెట్టి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి ముద్దుగా శునకరాజు అనే పేరు కూడా పెట్టుకున్నాడు.  ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పెంచుకున్న కుక్క అనుకోకుండా చనిపోయింది. గత ఐదేళ్ల క్రితం ఈ పెంపుడు కుక్క శునకరాజు చనిపోయింది. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. 

ఆ బాధను తట్టుకోలేక ఐదు సంవత్సరాల నుంచి శునకరాజుకు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇక ఐదో వర్ధంతి సందర్భంగా శునకరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయబద్ధంగా కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు.  

 

 

Leave a Comment