వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడు.. పసుపు పచ్చగా మారిన నాలుక..!

36
Cold Agglutinin

కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వైద్యులు వెల్లడించారు. 

ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఆ బాలుడికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బాలుడికి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. 

యూఎన్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. ఆ బాలుడికి చికిత్సలో చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. ఆ తర్వాత బాలుడు కోలుకున్నాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. 

Previous articleచనిపోయిన కుక్కకు విగ్రహం.. ఐదేళ్లుగా వర్థంతి..!
Next articleవివాదానికి తెర : కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here