భర్త వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య.. వీర్యం సేకరించిన కొద్ది గంటల్లో భర్త మృతి..!

కరోనాతో చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకెక్కింది. కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. కోర్టు అనుమతితో వీర్యం కూడా సేకరించారు. అయితే వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే ఆ భర్త మరణించాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరపు న్యాయవాది తెలిపారు. 

వివరాల మేరకు గుజరాత్ కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్తకు కరోనా సోకి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయి. దీంతో అతను ఎప్పుడైనా చనిపోవచ్చని వైద్యులు అతని భార్య, కుటుంబ సభ్యులకు తెలిపారు. 

ఈక్రమంలో తన భర్త ప్రతిరూపాన్ని అయినా చూసుకునేందుకకు వీలుగా బిడ్డను కంటానని, అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది. అయితే అందుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని వైద్యులు చెప్పడంతో ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.  

వైద్యుల అభిప్రాయం ప్రకారం తన భర్త బతికే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. ఈనేపథ్యంలో సదరు కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని, మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుని వీర్య సేకరణకు కోర్టు అత్యవసర అనుమతులు జారీ చేసింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతడు మరణించాడు. 

Leave a Comment