చీరల వ్యాపారంలోకి రానున్న అంబానీ.. అవంత్రా పేరుతో ప్రత్యేక స్టోర్లు..!

దేశంలోని నెంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే వ్యాపారం చాలా రంగాల్లో దూసుకుపోతోంది.. త్వరలో చీరల వ్యాపారంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడట. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ రిటైల్ ఈ వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ‘అవంత్రా’ బ్రాండ్ నేమ్ తో ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేయనున్నాట్లు సమచారం. 

బెంగళూరులో తొలి స్టోర్ ను ఏర్పాటు చేయనున్నారు. తర్వాత కర్నాటకలోని మిగితా ప్రాంతాలతో పాటు ఏపీలోనూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు ఆయాన ప్రాంతాల నేత కార్మికులు, నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ప్రైవేట్ బ్రాండ్లతోనూ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సమాచారం.  ఆభరనాల బ్రాండ్ అయిన తనిష్క త్వరలోనే సంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి రానుంది.  టాటా గ్రూపునకు చెందిన తనిష్క్, ఆదిత్య బిర్లా గ్రూపులకు పోటీగా రిలయన్స్ ఈ వ్యాపారాన్ని నెలకొల్పతున్నట్లు సమాచారం. 

Leave a Comment