‘ఫొటోలో తెల్లగా ఉండి.. ఇక్కడ నల్లగా ఉన్నాడు’..పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు..!

పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చింది ఓ వధువు.. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని వివాహం రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఎటావా జిల్లా భర్తనాకు చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీంతో బంధుమిత్రులు, అతిథులను పిలిచి ఘనంగా ఏర్పాట్లు చేశారు.. 

వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయంలో.. నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వధువు షాకిచ్చింది. ఫొటోలో చూసిన వ్యక్తి ఇతను కాదని, అతడు చాలా అందంగా ఉన్నాడని చెప్పింది. ఇతను నల్లగా ఉన్నాడని, వీళ్లు తనను మోసం చేశారని ఏడ్చింది. ఫొటోలో తెల్ల వ్యక్తిని చూపించి.. నల్లగా ఉండే వ్యక్తి పెళ్లి చేస్తున్నారని, వరుడు మారిపోయాడని ఆరోపించింద. 

ఇక వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు రెండు కుటుంబాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో చివరికి పెళ్లిని రద్దు చేశారు..   

Leave a Comment