వత్తుల పేరుతో రూ.20 కోట్లు మోసం.. డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ..!

హైదరాబాద్ బోడుప్పల్ లో భారీ మోసం బయటపడింది. వత్తుల తయారీ పేరుతో డిపాజిట్లు వసూలు చేసిన ఏబీజీ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ.20 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.. వివరాల మేరకు.. ఏబీజీ అనే సంస్థ డిపాజిట్ చెల్లిస్తే.. వత్తుల తయారీకి యంత్రాలు, దూది ఇస్తామని నిరుద్యోగులను నమ్మబలికింది. 

అలా ఒక్కో వ్యక్తి నుంచి రూ.1.70 లక్షలు డిపాజిట్ సేకరించింది. కిలో దూది రూ.300లకు తీసుకొని వత్తులు తయారు చేసి ఇవ్వాలని చెప్పింది. ఆ వత్తులను తామే తీసుకుంటామని, రూ.600 చెల్లిస్తామని బాధితులతో ఒప్పందం చేసుకుంది. అలాగే 6 నెలల తర్వాత డిపాజిట్ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. 

వారి మాటలు నమ్మిన ఎంతో మంది పెద్ద ఎత్తున డిపాజిట్లు చెల్లించారు. అయితే రెండు నెలలకే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఏబీజే సంస్థ యజమాని బాల స్వామి గౌడ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 600 మంది నుంచి డిపాజిట్లు స్వీకరించినట్లు, రూ.20 కోట్ల మేర నిర్వాహకులు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 

Leave a Comment