జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ కి పోటీగా.. టెలికం రంగంలోకి అదానీ..!

ప్రస్తుతం టెలికం రంగంలో దిగ్గజ సంస్థలు ఏవంటే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పేర్లు వినిపిస్తాయి.. వీటికి పోటీగా త్వరలో కొత్త సంస్థ రాబోతోంది.. అదానీ గ్రూప్ టెలికం రంగంలోకి వచ్చేందుక సిద్ధమవుతోంది. త్వరంలో కేంద్ర నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికం రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు గౌతమ్ అదానీ భావిస్తున్నట్లు తెలిసింది. 

5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్ ఇటీవల నేషనల్ లాంగ్ డిస్టెన్స్, ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్స్ పొందిందని తెలిపాయి. వేలం ప్రకారం దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న వెల్లడిస్తారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్లు విలువ చేసే స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభంకానుంది. 

Leave a Comment