ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏంచేయాలి?

ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే సమయంలో కొన్ని సార్లు చిరిగిన, చెల్లని నోట్లు వస్తుంటాయి. చిరిగిన నోట్లు వచ్చినప్పుడు ఎక్కడా మార్చుకోవడానికి అవ్వదు. ఎందుకంటే చిరిగిన నోట్లను ఎవరూ తీసుకోరు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలలో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వచ్చినప్పుడు ఏ ఏటీఎం నుంచి తీశారో ఆ బ్యాంకు నుంచి డబ్బులు మర్చుకోవచ్చు. దీని కోసం డబ్బులు విత్ డ్రా చేసిన తేదీ, ఆ సమయం, లొకేషన్ మరియు విత్ డ్రా స్లిప్ వివరాలు ఇవ్వాలి. ఒకవేళ్ల స్లిప్ లేకపోతే మీ మొబైల్ కి వచ్చిన మెసేజ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏటీఎం నుంచి చినిగిన నోట్లు రావు. ఎందుకంటే ఏటీఎంలో నోట్లను లోడ్ చేసే ముందు అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తారు. అందువల్ల ఏటీఎంలలో అలాంటి నోట్లు రావు అని చెబుతుంది. ఒకవేళ వస్తే వాటిని మార్చుకోవచ్చని తెలిపింది. 

స్టేట్ బ్యాంక్ ఇండియా ప్రకారం కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఫిర్యాదు చేయడం కోసం http://crcf.sbi.co.in/ccf/ క్లిక్ చేసి జనరల్ బ్యాంకింగ్ లేదా క్యాష్ రిలేటడ్ కేటగిరీలోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. అయితే ఇది ఎస్బీఐ ఏటీఎం నుంచి డ్రా చేసిన వారికి మాత్రమే.. ఇదిలా ఉంటే ఏ బ్యాంక్ కూడా చిరిగిన నోట్లను తీసుకోవడానికి నిరాకరించవు. ఒకవేళ నిరాకరిస్తే ఆ బ్యాంక్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు.. 

Leave a Comment