అప్పులు తెచ్చి మరీ దోచుకున్నారు : బొత్స

విశాఖ : చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తిన్నారని, చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దనే రూ.2వేల కోట్లు బయటపడితే ఆక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో ప్రజలు గమనించాలని కోరారు. ఐటీ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అక్రమ లావాదేవీలపై చంద్రబాబు నోరు విప్పాలని సవాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు. చంద్రబాబు, లోకేష్ బినామీలపై ఐటీ సోదాలు జరిగాయన్నారు. విజయవాడ, హైదరాబాద్ సహా ఢిల్లీ, పుణెలలో కూడా సోదాలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ భారీగా అక్రమ లావాదేవీలు చేసినట్టు అధికారులు గుర్తించారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని, రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ల పేరుతో రూ.వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. 

దోపిడీకి పాల్పడ్డారనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాం..

చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారనే తాము రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని, పేదలకు ఇళ్ల పేరుతో కూడా చంద్రబాబు అవినీతి చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు 46 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడంతోనే చంద్రబాబు బాగోతం అర్థమైందన్నారు. రూ.3239 కోట్ల విలువైన పనులకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తే రూ.393 కోట్లు మిగిలాయంటే గత ప్రభుత్వ హయాంలో దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు రూ.800 కోట్లు ఆదా అయిందన్నారు. తన మాజీ పీఎస్ అక్రమాలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Leave a Comment