సోషల్ మీడియాలో పౌరుల కదలికలపై నిఘా..

కేంద్రం చేతికి 40 కోట్ల మంది డేటా

ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్..వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ తమ భావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు. వ్యక్తి గతంగా గోప్యతను కలిగి ఉంటూ రాజకీయంగా, సామాజికంగా భావవ్యక్తీకరణ చేయవచ్చు. అయితే ఇదంతా మారబోతుంది. పౌరుల గోప్యతను భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నిబంధనావళిని తీసుకురాబోతుంది. మెస్సేజింగ్ యాప్స్ ( వాట్సాప్, మెసేంజర్, స్నాప్ చాట్, వైబర్, టెలిగ్రామ్, విచాట్), సామాజిక మాధ్యమాలు ( ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్) వాడుతున్న 40 కోట్ల మంది గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రతిపాదిత కొత్త నిబంధనలపై ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫేస్ బుక్, అమెజాన్ ఆల్ఫాబెట్, గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేశాయని, పౌరుల గోప్యత ప్రాథమిక హక్కని పేర్కొన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు కొత్త నిబంధనావళి భంగం కలిగిస్తున్నాయని ఆ సంస్థలు పేర్కొన్నాయి. 

త్వరలో కొత్త నిబంధనావళి – ఎన్ఎన్ కౌల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మీడియా సలహాదారు

సామాజిక మాధ్యమాలు నిర్వహిస్తున్న కంపెనీలు, మెసేజింగ్ యాప్స్ కోసం నూతన నిబంధనావళి రూపొందిస్తున్నాం. ప్రక్రియ కొనసాగుతుంది. కంపెనీలకు కొత్తగా ఇస్తున్న మార్గదర్శకాలు, నిబంధనావళిలో మార్పులు ఏమిటన్నది ఇప్పుడు బయటపెట్టలేము.

అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే..

కొత్త నిబంధనల ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పోలీస్, సిబిఐ, రా, ఇతర నిఘా సంస్థలు ఎప్పుడంటే అప్పుడు సేకరించవ్చు. ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పౌరులు, హక్కుల నేతలు రాజకీయంగా, సామాజికంగా వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ అధినేతలను విమర్శించినా..ఇక అంతే సంగతి. ఆ పోస్టులు పెట్టందెవరన్నది ప్రభుత్వ వర్గాలకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, వాట్సాప్, ఇవ్వాల్సిందే.. దాంతో పోలీస్, నిఘా వర్గాలు వారిని లక్ష్యంగా చేసేకునేందుకు అవకాశముంది. 

న్యాయస్థానం ఆదేశంతో అవసరం లేదు

ఫలానా పోస్ట్ (వీడియోలు, ఇతర సందేశాలు) ఎవరు చేశారు? ఎక్కడ నుంచి మొదలైంది? ఏ వర్గానికి చెందిన వారు? వారి కులం, మతం, రాజకీయ సామాజిక నేపథ్యం ? మొదలైన వివరాలు సేరకించవచ్చు. ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని 72 గంటల్లోగా గూగుల్, యూట్యూబ్, బైట్ డ్యాన్స్, టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ఇవ్వాలి. తమకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో ఎవరైనా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. న్యాయ స్థానాల ఆదేశాలతో సంబంధం ఉండదు. పోలీస్ వారెంటూ అవసరం లేదు.

Leave a Comment