రాజమౌళిపై బోనీకపూర్ ఫైర్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సినిమా తేదీని కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తేదీ ప్రకటనపై బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ రాజమౌళీపై ఫైర్ అయ్యారు. 

ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘మైదాన్’ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ కూడా అక్టోబర్ 13నే విడుదల అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇతర భాషల్లోనూ విడుదల అవుతోంది. దీంతో బాలీవుడ్ లో ఒకే నెలలో ‘మైదాన్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు విడుదల అయితే క్లాష్ తప్పదు. రెండు సినిమాలపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  తాను చాలా అప్ సెట్ అయ్యానని చెప్పారు. ఇది అనైతికమన్నారు. ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్ ని ఆరు నెలల క్రితమే ప్రకటించాని తెలిపారు. ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన సమయంలో రాజమౌళి ఇలా చేశాడని పేర్కొన్నారు. 

Leave a Comment